శుక్రవారం 05 జూన్ 2020
National - May 11, 2020 , 12:21:40

అమెరికా నుంచి హైద‌రాబాద్ చేరుకున్న‌ 118 మంది

అమెరికా నుంచి హైద‌రాబాద్ చేరుకున్న‌ 118 మంది

హైద‌రాబాద్‌: వ‌ందేభార‌త్ మిష‌న్‌లో భాగంగా అమెరికా నుంచి 118 మంది ప్ర‌యాణికులు హైద‌రాబాద్‌కు చేరుకున్నారు. ఎయిరిండియా విమానం ఏఐ-1617 అమెరికాలో చిక్కుకున్న 118 మంది భార‌తీయుల‌తో శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి బ‌య‌లుదేరి ముంబై మీదుగా ఈ ఉద‌యం 9.22 గంట‌ల‌కు హైద‌రాబాద్‌లోని జీఎంఆర్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి చేర‌కుంది. విమ‌నాశ్ర‌య అధికారులు 20, 25 మందికి ఒక బ్యాచ్ చొప్పున ప్ర‌యాణికులను బ్యాచ్‌ల వారీగా కింద‌కు దించి థ‌ర్మ‌ల్ స్క్రీనింగ్ చేశారు. అనంత‌రం వారంద‌రీని న‌గ‌రంలోని వివిధ క్వారెంటైన్ కేంద్రాలకు త‌ర‌లించారు. వీరంతా 14 రోజుల‌పాటు విధిగా క్వారెంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. కాగా, ఈ సాయంత్రం మ‌రో ఎయిరిండియా విమానం ఏఐ-1920 హైద‌రాబాద్‌కు చేరుకోనుంది. అబుదుబాయ్‌లో చిక్కుకున్న భార‌తీయుల‌ను ఈ విమానం హైద‌రాబాద్‌కు చేర్చ‌నుంది. ‌

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo