శుక్రవారం 03 జూలై 2020
National - Apr 11, 2020 , 15:50:28

రాజ‌స్థాన్‌లో ఒకేరోజు 117 మందికి క‌రోనా!

రాజ‌స్థాన్‌లో ఒకేరోజు 117 మందికి క‌రోనా!

జైపూర్‌: రాజ‌స్థాన్‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న‌ది. శ‌నివారం ఒక్క‌రోజే కొత్త‌గా 117 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 678కి చేరింది. కొత్త‌గా క‌రోనా సోకిన 117 మందిలో అత్య‌ధికంగా జైపూర్ జిల్లాకు చెందిన‌వారు 65 మంది ఉన్నారు. ఆ త‌ర్వాత టోంక్ జిల్లాకు చెందిన 18 మందికి, కోటా జిల్లాకు చెందిన‌ 14 మందికి, బ‌న్స్‌వారా జిల్లాకు చెందిన వారు 13 మందికి శ‌నివారం క‌రోనా పాజిటివ్‌గా తేలింది. మిగ‌తా వారిలో బిక‌నీర్‌కు చెందిన న‌లుగురు, డౌసా, జైస‌ల్మేర్‌, క‌రౌలీ జిల్లాల‌కు చెందిన వారు ఒక్కొక్క‌రు చొప్పున ఉన్నారు.     

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo