సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 23:07:49

బెంగాల్లో 1147 క‌రోనా మ‌ర‌ణాలు!

బెంగాల్లో 1147 క‌రోనా మ‌ర‌ణాలు!

కోల్‌క‌తా: ప‌శ్చిమ‌బెంగాల్‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న‌ది. ప్ర‌తి రోజు వేలల్లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. సోమ‌వారం కూడా కొత్త‌గా 2,282 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ప‌శ్చిమ‌బెంగాల్‌లో న‌మోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 44,769కి చేరింది. అందులో 26,418 మంది వైర‌స్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, మ‌రో 17,204 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక క‌రోనా మ‌ర‌ణాలు కూడా రోజూ క్ర‌మం త‌ప్ప‌కుండా పెరుగుతూనే ఉన్నాయి. సోమ‌వారం కూడా 35 మంది క‌రోనా బాధితులు మృతిచెంద‌డంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం మృతుల సంఖ్య 1147కు చేరింది. ప‌శ్చిమ‌బెంగాల్ ఆరోగ్య‌శాఖ అధికారులు ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo