బుధవారం 27 మే 2020
National - May 16, 2020 , 13:56:12

మహారాష్ట్రలో 1140 మంది పోలీసులకు కరోనా

మహారాష్ట్రలో 1140 మంది పోలీసులకు కరోనా

ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్‌ విజృంభన కొనసాగుతున్నది. ఆ రాష్ట్ర పోలీస్‌ సిబ్బందిని సైతం మహమ్మారి పట్టిపీడిస్తున్నది. ఇప్పటికే అక్కడ 1140 మంది పోలీసులు కరోనా రక్కసి బారినపడ్డారు. వారిలో 268 మంది వైరస్‌ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 10 మంది మరణించారు. మిగతా 862 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వారంతా వివిధ ఐసోలేషన్‌ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు. ఇదిలావుంటే కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి ఐపీసీ సెక్షన్‌ 188 కింద రాష్ట్రంలో మొత్తం 1,08,479 కేసులు నమోదయ్యాయి. 231 మంది పోలీసులపై దాడులు జరిగాయి. పోలీసులపై దాడులకు సంబంధించి 812 మంది అరెస్టయ్యారు. ఇక రాష్ట్రంలో మొత్తం 20,626 మందిని అరెస్ట్‌ చేశారు. 58,568 వాహనాలను సీజ్‌ చేశారు. జరిమానాల రూపంలో రూ.4,36,74,894 సమకూరాయి. వైద్య సిబ్బందిపై దాడి ఘటనలు 37 చోటుచేసుకున్నాయి. 


logo