మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 06, 2020 , 15:15:07

పాకిస్తాన్‌లో చిక్కుకున్న భారతీయులకు శుభవార్త

పాకిస్తాన్‌లో చిక్కుకున్న భారతీయులకు శుభవార్త

ఇస్లామాబాద్‌: కొవిడ్‌-19 ప్రయాణ ఆంక్షలతో పాకిస్తాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులకు శుభవార్త. ఆ దేశంలో ఉన్న మొత్తం 114 మందిని ఈ నెల 9న అటారీ-వాఘా సరిహద్దు మీదుగా ఇండియాకు పంపించనున్నారు. ఈ మేరకు పాకిస్తాన్‌ ప్రభుత్వం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. 700 మంది భారతీయ పౌరులను అవసరమైన ఆరోగ్య భద్రతా ప్రొటోకాల్స్‌ను అనుసరించి జూన్ 25, 26, 27 న అటారీ-వాఘా బోర్డర్ ద్వారా భారతదేశానికి తిరిగి పంపించారు. భారతీయ పౌరులు చాలా మంది పాకిస్తాన్‌లో ఉన్న తమ బంధువులను కలిసేందుకు, మతపరమైన కర్మలు చేసేందుకు వెళ్లి లాక్‌డౌన్‌ వల్ల అక్కడే ఉండిపోయారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo