శుక్రవారం 05 జూన్ 2020
National - Apr 04, 2020 , 09:52:27

ప్రత్యేక విమానంలో 112 మంది ఫ్రెంచ్‌ జాతీయుల తరలింపు

ప్రత్యేక విమానంలో 112 మంది ఫ్రెంచ్‌ జాతీయుల తరలింపు

కొచ్చి : ఫ్రెంచ్‌ దేశస్థులు 112 మందిని నేడు ఎయిర్‌లిఫ్ట్‌ ద్వారా పారిస్ కు తరలించారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో వీరంతా కేరళలో చిక్కుకుపోయారు. అందరికి కరోనా పరీక్షల నిర్వహించిన అనంతరం నేడు తరలింపునకు చర్యలు చేపట్టారు. 112 మందిని ఎయిర్‌ ఇండియాకు చెందిన ప్రత్యేక విమానంలో ఈ ఉదయం తరలించారు. కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వీరందరికి స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించారు. వీరి బ్యాగులను సైతం శానిటైజేషన్‌తో శుభ్రపరిచారు.

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo