ఆదివారం 31 మే 2020
National - May 12, 2020 , 20:08:49

ప‌శ్చిమ‌బెంగాల్ లో 110 పాజిటివ్ కేసులు

ప‌శ్చిమ‌బెంగాల్ లో 110 పాజిటివ్ కేసులు

కోల్ క‌తా: పశ్చిమ‌బెంగాల్ లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. రాష్ట్రంలో ఇవాళ ఒక్క రోజే కొత్త‌గా 110 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో రాష్ట్రంలో న‌మోదైన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2173కు చేరు‌కుంది.వీటిలో 1363 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. 612 మంది డిశ్చార్జయ్యారు. మొత్తం ఇప్పటివ‌ర‌కు 126 మంది మృతి చెందార‌ని ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్ల‌డించింది.

రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో కంటైన్ మెంట్ జోన్ల‌లో పోలీసులు లాక్ డౌన్ రూల్స్ క‌ఠినంగా అమ‌లు చేస్తున్నారు. నిత్య‌వ‌స‌ర స‌రుకులు, ఇత‌ర సామాగ్రి ఇంటివ‌ద్ద‌కే పంపిణీ చేస్తున్నారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo