మంగళవారం 26 మే 2020
National - May 24, 2020 , 09:14:43

70 శాతం కరోనా కేసులు 11 మున్సిపాలిటీల్లోనే

70 శాతం కరోనా కేసులు 11 మున్సిపాలిటీల్లోనే

న్యూఢిల్లీ: దేశంలో నమోదవుతున్న మొత్తం కరోనా కేసుల్లో 70 శాతం ఏడు రాష్ర్టాల్లో పదకొండు మున్సిపాలిటీల్లోనే నమోదవుతున్నాయి. ఈ మున్సిపాలిటీలు మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌,  రాజస్థాన్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ర్టాల్లో ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో గత 24 గంటల్లో 3250 మంది బాధితులు కోలుకున్నారని తెలిపారు. రికవరీరేటు 41.39 శాతంగా ఉందని పేర్కొంది. దేశంలోని అన్ని జిల్లాలను రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లుగా విభజించింది. ఈ జోన్లకు సంబంధించి అన్ని నిర్ణయాలు స్థానిక అధికారులే తీసుకోవాలని వెల్లడించింది. 


logo