గురువారం 09 జూలై 2020
National - May 30, 2020 , 13:37:59

మరో 11 మంది హెల్త్‌కేర్‌ వర్కర్స్‌కు కరోనా పాజిటివ్‌

మరో 11 మంది హెల్త్‌కేర్‌ వర్కర్స్‌కు కరోనా పాజిటివ్‌

న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. మరో 11 మంది హెల్త్‌కేర్‌ వర్కర్స్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ఢిల్లీ వైద్యాధికారులు వెల్లడించారు. దీంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 206కు చేరింది. తాజాగా నమోదైన కరోనా కేసుల్లో ఇద్దరు రెసిడెంట్‌ డాక్టర్లు ఉన్నారు. 

ఫిబ్రవరి 1 నుంచి నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో ఇద్దరు ఫ్యాకల్టీ లెక్చరర్లు, పది మంది రెసిడెంట్‌ డాక్టర్లు, 26 మంది నర్సులు, తొమ్మిది మంది టెక్నిషీయన్లు, ఐదుగురు మెస్‌ వర్కర్లు, 49 మంది అటెండర్లు, 34 మంది శానిటేషన్‌ వర్కర్లు, 69 మంది సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. 

ఈ వైరస్‌ నుంచి సుమారు 150 మందికి పైగా కోలుకుని మళ్లీ విధుల్లో చేరినట్లు ఎయిమ్స్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఏకే శర్మ వెల్లడించారు. గత మూడు రోజుల్లోనే 64 మంది హెల్త్‌కేర్‌ వర్కర్స్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ఆయన పేర్కొన్నారు. ఎయిమ్స్‌లో విధులు నిర్వర్తించే సిబ్బంది పట్ల తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. 


logo