సోమవారం 25 మే 2020
National - Apr 02, 2020 , 01:26:05

ఒకే కుటుంబంలో 11 మందికి..

ఒకే కుటుంబంలో 11 మందికి..

జైపూర్‌: ఒకరి నిర్లక్ష్యం వల్ల రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఓ కుటుంబంలోని 11 మందికి కరోనా సోకింది. రామ్‌గంజ్‌కు చెందిన ఓ వ్యాపారి మార్చి 12న ఒమన్‌ నుంచి తిరిగివచ్చారు. ఢిల్లీ నుంచి సొంతూరు చేరుకున్న మరునాడు స్నేహితుడితో మార్కెట్‌ వద్ద కొంతసేపుగడిపారు.  సుమారు 53 మందిని కలిశారు. పక్షం రోజుల తర్వాత ఆ వ్యాపారి, మిత్రుడు, మిత్రుడి కుటుంబంలోని పది మందికి కలిపి మొత్తంగా 12 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మరింత మందికి వైరస్‌ వ్యాపించి ఉంటుందని అనుమానిస్తున్న అధికారులు ఆ ప్రాంతాన్ని నిర్బంధించి ఇంటింటా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. logo