శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 09:05:24

కోల్‌కతాలో పిడుగుపాటుకు 11మంది మృతి

కోల్‌కతాలో పిడుగుపాటుకు 11మంది మృతి

కోల్‌కతా : పిడుగుపాటుకు 11మంది మృతి చెందిన ఘటనలు పశ్చిమబెంగాల్‌లోని  మూడు జిల్లాల్లో వెలుగుచూశాయి. బంకురా, పూర్బ బర్ధమాన్, హౌరా జిల్లాల్లో పిడుగులు పడి 11 మంది మృత్యువాత పడ్డారు. బంకురా జిల్లాలో ఐదుగురు, పూర్బ బర్ధమాన్ జిల్లాలో ఐదుగురు, హౌరాలో ఒకరు మరణించారు. పొలంలో పనిచేస్తుండగా పిడుగులు పడి వీరు మరణించారు. వేర్వేరు గ్రామాల్లో పిడుగు పాటుకు 11 మంది మరణించారని అధికారులు చెప్పారు.

వర్షం పడుతుందని ఒకరు చెట్టు కిందకు వెళ్లగా పిడుగు పడి మృతి చెందాడు. దక్షిణ పశ్చిమబెంగాల్ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo