మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 07:16:31

35 ఏండ్ల కిందటి ఎన్‌కౌంటర్‌లో తీర్పు

35 ఏండ్ల కిందటి ఎన్‌కౌంటర్‌లో తీర్పు

  • 11 మంది పోలీసులు దోషులు

మధుర : 35 ఏండ్ల కిందట జరిగిన ఎన్‌కౌంటర్‌ ఘటనలో మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లా కోర్టు 11 మంది పోలీసులను దోషులుగా నిర్ణయించింది. దీని వివరాలిలా ఉన్నాయి. రాజస్థాన్‌లో భరత్‌పూర్‌ రాజ కుటుంబ సభ్యుల్లో ఒకరైన రాజామాన్‌ సింగ్‌ 1985లో స్వతంత్ర అభ్యర్థిగా నాటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగారు. తన ప్రత్యర్థి, కాంగ్రెస్‌ అభ్యర్థి తరఫున మాజీ ముఖ్యమంత్రి శివచరణ్‌ మాథుర్‌ ప్రచారానికి వచ్చినప్పుడు జరిగిన ఘర్షణల్లో.. నిలిపి ఉంచిన సీఎం హెలికాప్టర్‌ను మాన్‌సింగ్‌ తన జీపుతో ఢీకొట్టారు. ఈ ఘటన జరిగిన మరుసటిరోజు ఫిబ్రవరి 21న పోలీసులు మాన్‌సింగ్‌తోపాటు అతడి ఇద్దరి అనుచరులను కాల్చిచంపారు. ఈ కేసు విచారణ తొలుత రాజస్థాన్‌లో జరిగినప్పటికీ.. ఆ తర్వాత యూపీకి బదిలీ అయ్యింది.


logo