శుక్రవారం 05 జూన్ 2020
National - May 12, 2020 , 16:19:20

వేట‌గాళ్ల‌కు చెమ‌ట‌లు ప‌ట్టించిన టెన్త్ విద్యార్థి

వేట‌గాళ్ల‌కు చెమ‌ట‌లు ప‌ట్టించిన టెన్త్ విద్యార్థి

జోధ్ పూర్ : మ‌ంగ‌ళ‌వారం రాత్రి ఇద్ద‌రు వేటగాళ్లు చింకారా జింక‌ను వేటాడేందుకు అట‌వీప్రాంతంలోకి ప్ర‌వేశించారు. వేట‌గాళ్లు రాత్రి పూట తుపాకి (.303) తో జింకల‌ను చంపేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. జోధ్ పూర్ కు చెందిన ముఖేష్ బిష్ణోయ్ కు తుపాకి తూటాల శ‌బ్దం వినిపించింది. అత‌డు వెంట‌నే త‌న ఇద్ద‌రి స్నేహితుల‌తో తూటాల శ‌బ్దం వ‌చ్చిన వైపు ప‌రుగెత్తాడు.

ముఖేష్ బిష్ణోయ్ తుపాకులు ప‌ట్టుకుని వ‌చ్చిన ఇద్ద‌రు వేట‌గాళ్ల‌కు చెమ‌ట‌లు ప‌ట్టించి పారిపోయేలా చేశాడు. ప‌దిహేనేళ్ల ముఖేష్ బిష్ణోయ్  ప‌దోత‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. ముఖేష్ బిష్ణోయ్ సాహ‌సాన్ని ప్ర‌శంసిస్తూ ఐఎఫ్ఎస్ అధికారి ప‌ర్వీన్ కాశ్వాన్ ఈ విషయాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo