గురువారం 28 మే 2020
National - May 11, 2020 , 22:13:24

యూపీలో కొత్త‌గా 109 పాజిటివ్ కేసులు

యూపీలో కొత్త‌గా 109 పాజిటివ్ కేసులు

ల‌క్నో: యూపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇవాళ ఒక్క రోజే యూపీలో 109 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 3573కు చేరుకున్నాయి. వీరిలో 1758 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ‌య్యారు. 1735 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

ఇప్ప‌టివ‌ర‌కు 80 మంది మృతి చెందార‌ని యూపీ వైద్యారోగ్య శాఖ వెల్ల‌డించింది. హాట్ స్పాట్లు, కంటైన్ మెంట్ జోన్ల‌లో పోలీసులు లాక్ డౌన్ రూల్స్ క‌ఠినంగా అమ‌లు చేస్తున్నారు. అత్య‌వ‌రం కాకున్నా రోడ్ల‌పైకి వ‌స్తున్న వారిపై కేసులు న‌మోదు చేస్తున్నారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo