శనివారం 28 నవంబర్ 2020
National - Oct 24, 2020 , 17:20:19

పోలీసుల వైఖ‌రికి నిర‌స‌న‌గా 108 గిరిజ‌న గ్రామాల్లో ఎన్నిక‌ల బ‌హిష్క‌ర‌ణ‌

పోలీసుల వైఖ‌రికి నిర‌స‌న‌గా 108 గిరిజ‌న గ్రామాల్లో ఎన్నిక‌ల బ‌హిష్క‌ర‌ణ‌

ప‌ట్నా: గిరిజనులపై పోలీసుల దాడుల‌కు నిరసనగా ఎన్నిక‌లను బ‌హిష్క‌రించాల‌ని బీహార్‌లోని 108 గిరిజ‌న గ్రామాలు నిర్ణ‌యించాయి. మ‌రో నాలుగు రోజుల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలి విడుత పోలింగ్ జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో.. ఎన్నిక‌లను బహిష్కరిస్తున్న‌ట్లు 108 గిరిజన గ్రామాల ప్ర‌జ‌లు ప్రకటించారు. బీహార్‌లోని కైమూర్ ప్రాంతంలో పోలీసులు తప్పుడు కేసులు పెట్టి 25 మంది కైమూర్ ముక్తి మోర్చా కార్యకర్తలను అరెస్టు చేశారు. 

అంతేగాక‌ అటవీశాఖ అధికారులు త‌ర‌చూ పోలీసులను ఉపయోగించి వారిపై దాడులు చేయిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయా గిరిజ‌న గ్రామాల ప్ర‌జ‌లు ఎన్నిక‌ల బ‌హిష్క‌ర‌ణ నిర్ణ‌యం తీసుకున్నారు. కాగా, పోలీసుల వైఖరికి నిరసనగానే కైమూర్ ప్రాంతంలోని 108 గిరిజన గ్రామాల ప్రజలు పోలింగ్‌ను బహిష్కరిస్తున్నార‌ని కైమూర్ ముక్తి మోర్చా వెల్ల‌డించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.