మంగళవారం 27 అక్టోబర్ 2020
National - Sep 21, 2020 , 01:24:50

కరోనాను జయించిన ఠాణె బామ్మ

కరోనాను జయించిన ఠాణె బామ్మ

ఠాణె: మహారాష్ట్రలోని ఠాణె జిల్లా డోంబివ్లీకి చెందిన 106 ఏండ్ల వృద్ధురాలు కరోనా మహమ్మారిని జయించారు. కల్యాణ్‌ డోంబివ్లీ నగర పాలక సంస్థ ఏర్పాటు చేసిన కరోనా చికిత్సా కేంద్రంలో 10 రోజులు చికిత్స పొందిన అనంతరం కోలుకున్నారు. ఆదివారం దవాఖాన నుంచి డిశ్చార్జీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమెకు వైద్యులు, నర్సులు ఘనంగా వీడ్కోలు పలికారు. తొలుత వయస్సు రీత్యా ఆమెను అడ్మిట్‌ చేసుకునేందుకు ఏ దవాఖాన ముందుకు రాలేదని వృద్ధురాలి కోడలు వాపోయారు. కొవిడ్‌-19 చికిత్సా కేంద్రంలోని వైద్యులు, నర్సుల ప్రత్యేక శ్రద్ధ వల్లే తన అత్త కోలుకున్నారని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. logo