శనివారం 06 జూన్ 2020
National - May 11, 2020 , 07:58:09

రైలులో 1055 మంది గోవా టు ఉధంపూర్‌

రైలులో 1055 మంది గోవా టు ఉధంపూర్‌

గోవా: లాక్ డౌన్ ప్ర‌భావంతో దేశ‌వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వ‌లస కార్మికులు, కూలీల‌ను ప్ర‌భుత్వం వెన‌క్కి తీసుకొస్తోంది. ఇందుకోసం రైల్వే శాఖ ప్ర‌త్యేక రైళ్ల‌ను ఏర్పాటు చేసింది. గోవా నుంచి 1055 మంది ప్ర‌యాణికులతో ప్ర‌త్యేక రైలు జ‌మ్మూక‌శ్మీర్ లోని ఉధంపూర్ కు బ‌య‌లుదేరింది.

అధికారులు ప్ర‌యాణికులంద‌రికీ రైల్వే స్టేష‌న్ లో స్క్రీనింగ్ నిర్వ‌హించి..శానిటైజేష‌న్ పూర్తి చేశారు. రైలు కోచ్ ల‌ను శానిటైజ్ చేశారు. ప్ర‌యాణికులంద‌రికీ ఫేస్ మాస్కుల‌ను అంద‌జేశారు. స్వ‌స్థ‌లాల‌కు చేరుకున్న వారంతా క్వారంటైన్ లో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo