మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 10:01:00

9 రోజుల్లోనే కోవిడ్ నుంచి కోలుకున్న 105 ఏళ్ల కేర‌ళ బామ్మ

9 రోజుల్లోనే కోవిడ్ నుంచి కోలుకున్న 105 ఏళ్ల కేర‌ళ బామ్మ

హైద‌రాబాద్‌: కేర‌ళ‌లోని కొల్లామ్‌కు చెంద‌ని 105 ఏళ్ల బామ్మ‌.. కోవిడ్‌19 నుంచి కేవ‌లం తొమ్మిది రోజుల్లో కోలుకున్న‌ది. కొల్లామ్ మెడిక‌ల్ కాలేజీ సూప‌రిండెంట్ డాక్ట‌ర్ హ‌బీబ్ న‌సీమ్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. శ్వాస‌కోస ఇబ్బందుల‌తో జూలై 20వ తేదీన ఆ బామ్మ హాస్పిట‌ల్‌లో చేరింది.  జ్వ‌రం, ద‌గ్గు లాంటి ల‌క్ష‌ణాల‌తో ఆమె క‌రోనా ప‌రీక్ష‌లో పాజిటివ్‌గా తేలింది.  అయితే మెడిక‌ల్ బోర్డు ఆ బామ్మ‌కు ప్ర‌త్యేక చికిత్స అందించింది.  వారం రోజుల్లోనే తిరిగి ఆ వృద్ధురాలు క‌రోనా ప‌రీక్ష‌లో నెగ‌టివ్‌గా తేలింది. బుధ‌వారం రోజున ఆమెను డిశ్చార్జ్ చేశారు.  అప్పుడు చేసిన ప‌రీక్ష‌లోనూ ఆమెకు నెగ‌టివ్ వ‌చ్చింది. పాజిటివ్ వ‌చ్చి ఆందోళ‌న చెందేవారు ఆ బామ్మ‌ను చూసి నేర్చుకోవాల‌ని సూప‌రిండెంట్ తెలిపారు. బామ్మ‌కు ట్రీట్మెంట్ ఇచ్చిన హాస్పిట‌ల్ సిబ్బందికి ఆరోగ్య‌శాఖ మంత్రి కేకే శైల‌జా కంగ్రాట్స్ తెలిపారు. కోవిడ్ నుంచి కోలుకున్న అత్యంత వృద్ధురాలి జాబితాలో మూడ‌వ స్థానంలో నిలిచిందీమె.  107 ఏళ్ల డ‌చ్ మ‌హిళ‌, 106 ఏళ్ల ఢిల్లీ మ‌హిళ కూడా కోవిడ్ నుంచి కోలుకున్నారు.  logo