ఆదివారం 31 మే 2020
National - May 22, 2020 , 13:30:15

కర్ణాటకలో కొత్తగా 105 పాజిటివ్‌ కేసులు

కర్ణాటకలో కొత్తగా 105 పాజిటివ్‌ కేసులు

బెంగళూరు: కర్ణాటకలో కరోనా పాజిటివ్‌ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇవాళ కొత్తగా 105 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గురువారం సాయంత్రం 5 గంటల నుంచి ఇవాళ మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1710కు చేరుకుంది. ఈ కేసుల్లో 1080 యాక్టివ్‌ కేసులున్నట్లు కర్ణాటక వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

కర్ణాటకలో కంటైన్‌ మెంట్లు జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. కంటైన్‌ మెంట్‌ జోన్లలో ఉన్న వారికి నిత్యవసర సరుకులను ఇంటివద్దకే తీసుకెళ్లి అందజేస్తున్నారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo