శుక్రవారం 10 జూలై 2020
National - Jun 16, 2020 , 22:07:37

పంజాబ్‌లో 104 కరోనా కేసులు

పంజాబ్‌లో 104 కరోనా కేసులు

ఛండీఘడ్‌ : పంజాబ్‌ రాష్ట్రంలో మంగళవారం ఒక్కరోజే 104 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,371కి పెరిగింది. వీరిలో 2,461 మంది కోలుకోగా ప్రస్తుతం 838 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 10మందికి ఆక్సిజన్‌ అందిస్తున్నామని, వీరిలో ఒకరు కిటికల్‌ కేర్‌ యూనిట్‌లో వెంటిలేటర్‌పై ఉండగా 72మంది మృతి చెందారని ప్రభుత్వం తన నివేదికలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా 24గంటల వ్యవధిలో 10,667 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 380 మంది చనిపోయారు. ఇప్పటి వరకు దేశంలో 3,43,091 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమమంత్రిత్వశాఖ తెలిపింది.logo