బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 13:33:19

101 మంది పోలీసుల‌కు క‌రో‌నా

101 మంది పోలీసుల‌కు క‌రో‌నా

ముంబై: దేశంలో క‌రోనా కేసుల్లో మ‌హారాష్ట్ర అగ్ర‌స్థానంలో ఉన్న‌ది. ప్ర‌తి రోజు వేల సంఖ్య‌లో ప్ర‌జ‌లు క‌రోనా బారిన‌ప‌డుతున్నారు. వీరిలో పోలీసులు కూడా ఉంటున్నారు. రాష్ట్రంలో కొత్తగా 101 మంది పోలీసుల‌కు క‌రోనా సోకింద‌ని, ఈ వైర‌స్ వ‌ల్ల ఓ పోలీసు మ‌ర‌ణించాడ‌ని మ‌హారాష్ట్ర పోలీసు శాఖ ప్ర‌క‌టించింది. దీంతో పోలీసు శాఖ‌లో క‌రోనా కేసుల సంఖ్య 8,584కు పెరిగింద‌ని, ఇప్ప‌టివ‌ర‌కు 94 మంది చ‌నిపోయార‌ని తెలిపింది. క‌రోనా బారిన‌ప‌డివారిలో 6538 మంది పోలీసులు కోలుకున్నార‌ని వెల్ల‌డించింది. 

మ‌హారాష్ట్ర‌లో ఇప్ప‌టివ‌ర‌కు 3,75,799 మందికి క‌రోనా వైర‌స్ సోకింది. ఇందులో 13,656 మంది మ‌ర‌ణించ‌గా, 2,13,238 మంది కోలుకున్నారు. మ‌రో 1,48,905 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అదేవిధంగా దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు 14,35,453 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. 32,771 మంది మ‌ర‌ణించారు.  


logo