మంగళవారం 14 జూలై 2020
National - Jun 25, 2020 , 00:59:23

కరోనాపై పోరుకు ‘సిద్ధ’ం..సంప్రదాయ చికిత్సతో 100 % వ్యాధి నయం!

కరోనాపై పోరుకు ‘సిద్ధ’ం..సంప్రదాయ చికిత్సతో 100 % వ్యాధి నయం!

చెన్నై: కరోనాకు టీకాలు, ఔషధాలు తయారుచేసే పనిలో వైద్య ప్రపంచం తలమునకలై ఉండగా, భారతీయ ప్రాచీన సిద్ధవైద్యం కొత్త ఆశలను రేకెత్తిస్తున్నది.  తమిళనాడు రాజధాని చెన్నైలోని ఓ కొవిడ్‌-19 వైద్య కేంద్రంలో 25మంది రోగులకు సిద్ధవైద్యం అందించగా వారంతా సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో నగరంలో కరోనా కేంద్రంగా మారిన వ్యాసర్‌పాడిలోని అంబేద్కర్‌ కాలేజీ సెంటర్లో కూడా రోగులకు సిద్ధ వైద్యం అందించాలని అధికారులు నిర్ణయించారు. అయితే, వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న రోగులపై ఈ వైద్యాన్ని వాడటంలేదని తమిళనాడు అభివృద్ధిశాఖ మంత్రి కే పాండియరాజన్‌ తెలిపారు. ‘సిద్ధవైద్యంలో 100% సక్సెస్‌ రేటు ఉంది. ఇప్పుడు ఈ వైద్య విధానం ట్రంప్‌ కార్డులాంటిది. సిద్ధ వైద్యానికి శాస్త్రీయమైన ఆధారాలు లేకున్నా గొప్ప చరిత్ర ఉంది. దానిపై ప్రజలకు నమ్మకం ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. వెంటిలేటర్‌పై ఉన్నవారికి ఈ వైద్యం పనికిరాదని వెల్లడించారు. రోగనిరోధక శక్తి పెంచుకొనేందుకు ఈ వైద్యాన్ని వాడాలని ప్రధాని నరేంద్రమోదీ కూడా సూచించారని తెలిపారు. 


logo