గురువారం 28 మే 2020
National - May 14, 2020 , 12:04:41

మహారాష్ట్రలో వెయ్యి మంది పోలీసులకు కరోనా

మహారాష్ట్రలో వెయ్యి మంది పోలీసులకు కరోనా

ముంబై: దేశంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న మహారాష్ట్రలో వెయ్యి మందికి పైగా పోలీసులు ఈ ప్రాణాంతక వైరస్‌ బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1001 మంది పోలీసులు కరోనా పాజిటివ్‌లుగా తేలారని పోలీస్‌ శాఖ ప్రకటించింది. ఇందులో 851 కేసులు యాక్టివ్‌గా ఉంగా, 142 మంది కరోనా నుంచి కోలుకున్నారని వెల్లడించింది. ఈ వైరస్‌ బారిన పడిన ఎనిమిది మంది పోలీసులు మరణించారని తెలిపింది. మొత్తం 1001 మంది పోలీసుల్లో 107 మంది అధికారులు ఉన్నారని, మిగిలిన 894 మంది వివిధ హోదాల్లో ఉన్నారని పేర్కొంది.


logo