e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home News ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్‌.. 10,000 ట‌న్నుల మెడిక‌ల్ ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా

ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్‌.. 10,000 ట‌న్నుల మెడిక‌ల్ ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా

ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్‌.. 10,000 ట‌న్నుల మెడిక‌ల్ ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా

న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాల్లో క‌రోనా వైర‌స్ రోగుల‌కు ఆక్సిజ‌న్ కొర‌త‌ను తీర్చేందుకు భార‌తీయ రైల్వేశాఖ ప్ర‌త్యేకంగా ఆక్సిజ‌న్ రైళ్ల‌ను న‌డుపుతున్న విష‌యం తెలిసిందే. ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్ స‌రికొత్త మైలురాయి చేరుకున్న‌ట్లు ఇవాళ రైల్వే బోర్డు చైర్మ‌న్ సునీత్ శ‌ర్మ‌ తెలిపారు. ఇవాళ్టి వ‌ర‌కు ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్ దేశ‌వ్యాప్తంగా 10 వేల ట‌న్నుల లిక్విడ్ మెడిక‌ల్ ఆక్సిజ‌న్‌ను స‌ర‌ఫ‌రా చేసిన‌ట్లు బోర్డు చైర్మ‌న్ చెప్పారు. 13 రాష్ట్రాల‌కు ప్రాణ‌వాయువును స‌ర‌ఫ‌రా చేసిన‌ట్లు రైల్వే బోర్డు చైర్మ‌న్ వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా 1005 మెయిల్ లేదా ఎక్స్‌ప్రెస్ రైళ్ల‌ను న‌డుపుతున్న‌ట్లు చైర్మ‌న్ చెప్పారు. 3893 స‌బ‌ర్‌బ‌న్‌, 517 ప్యాసింజెర్ల రైళ్ల‌ను న‌డుపుతున్నార‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా రైల్వేకు చెందిన 4.32 ల‌క్ష‌ల మంది ఉద్యోగులు రాష్ట్రాల స‌హ‌కారంతో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న‌ట్లు సునీత్ శ‌ర్మ‌ వెల్ల‌డించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్‌.. 10,000 ట‌న్నుల మెడిక‌ల్ ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా

ట్రెండింగ్‌

Advertisement