శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 19:15:22

కరోనాను జయించిన వందేళ్ల వృద్ధురాలు

కరోనాను  జయించిన వందేళ్ల వృద్ధురాలు

పూణే: మహారాష్ట్రలో కొవిడ్‌-19తో జరిపిన పోరాటంలో ఓ వందేళ్ల వృద్ధురాలు విజయం సాధించింది. వైరస్‌ నుంచి కోలుకొని డిశ్చార్జి అయినట్లు పౌర అధికారులు తెలిపారు. వృద్ధురాలు, ఆమె కుటుంబంలోని మరో నలుగురు సభ్యులను జూలై 20న విమన్నగర్‌ ప్రాంతంలోని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో చేర్చారు. సెంటర్‌కు తీసుకువచ్చినప్పుడు వృద్ధురాలికి ఎలాంటి లక్షణాలు లేవని ఆక్సిజన్‌ స్థాయి కూడా సరిగానే ఉందని పేర్కొన్నారు. కొద్ది రోజుల తర్వాత ఆక్సిజన్‌ స్థాయి పడిపోయిందని, వైద్యులను ఆమెను పెద్ద దవాఖానాకు తరలించాలని నిర్ణయించినా.. కొన్ని కారణాలతో ఆమెను దవాఖానలో చేర్చుకోలేదు. ఆమెను తిరిగి కోవిడ్ కేర్ సెంటర్ సదుపాయానికి తీసుకువచ్చారు.

దీంతో వృద్ధురాలికి అవసరమైన చికిత్స ఇక్కడే అందించగా, పరిస్థితి మెరుగైందని చీఫ్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రాంచంద్ర హంకరే చెప్పారు. ఒక సమయంలో ఆమె పరిస్థితి క్లిష్టంగా మారిందని, కానీ వైద్యులు ఆమెను నిరంతరం పరిశీలనలో ఉంచి అవసరమైన చికిత్సను అందించారు. ఈ సెంటెనరియన్‌ మహిళ తన అల్లుడితో సహా కుటుంబంలోని నలుగురితో కలిసి ముందు రోజు దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యిందని పీఎంసీ డిప్యూటీ కమిషనర్‌ మాధవ్‌ జగ్తాప్‌ పేర్కొన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo