మంగళవారం 29 సెప్టెంబర్ 2020
National - Sep 17, 2020 , 12:42:06

కోవిడ్‌-19ను జ‌యించిన వందేళ్ల బామ్మ‌

కోవిడ్‌-19ను జ‌యించిన వందేళ్ల బామ్మ‌

గౌహ‌తి : వ‌ందేళ్ల బామ్మ కోవిడ్‌-19ను విజ‌య‌వంతంగా జ‌యించింది. ఈ ఘ‌ట‌న అసోం రాష్ర్టంలో చోటుచేసుకుంది. మ‌ద‌ర్స్ ఓల్డ్ ఏజ్ హోం నివాసితురాలైన మై హ్యాండిక్ అనే వృద్ధురాలు ప‌ది రోజులక్రితం క‌రోనా వైర‌స్ భారిన ప‌డింది. చికిత్స నిమిత్తం గౌహ‌తిలోని మ‌హేంద్ర మోహ‌న్ చౌద‌రి ఆస్పత్రిలో చేరారు. క‌రోనాపై పోరాటంలో ఆమె వ‌య‌స్సు ఒక స‌వాల్‌గా ఉన్న‌ప్ప‌టికీ త‌న సానుకూల స్పంద‌న‌, కృత‌నిశ్చ‌యంతో వ్యాధిని జ‌యించిన‌ట్లు వైద్యులు తెలిపారు. చేప‌లు, మాంసం, గుండ్లు, అర‌టిపండ్లు, చాపాతీలు, కూర‌గాయ‌లు ఆహారంగా ఇచ్చేవాళ్ల‌మ‌న్నారు. ఆమె డిశ్చార్జ్ అయి వెళ్లేట‌ప్పుడు వైద్యులు, న‌ర్సులు చిన్న‌పాటి వేడుక‌ను జ‌రిపారు.

ఈ సంద‌ర్భంగా మై హ్యాండిక్ స్పందిస్తూ... త‌న‌కు చికిత్స అందించిన, సేవ‌లు చేసిన‌ ప్ర‌తీఒక్క‌రికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. రాష్ర్ట‌ ఆరోగ్య మంత్రి హిమంత బిస్వా శర్మకు ఆమె ప్రత్యేక ప్రశంసలు అందించారు. త‌మంద‌రి కోసం మంత్రి చాలా కష్టపడుతున్నాడ‌న్నారు. ఈ వ్యాధితో బాధపడుతున్న ప్రజలకు సహాయం కొనసాగించాల్సిందిగా తాను ఆయనను ఆశీర్వదిస్తున్న‌ట్లు చెప్పారు. మ‌ద‌ర్స్ ఓల్డ్ ఏజ్ ఆశ్ర‌మానికి చెందిన 12 మంది వ్య‌క్తులు కోవిడ్‌-19 భారిన ప‌డ్డారు. వీరిలో ఇప్ప‌టివ‌ర‌కు ఐదుగురు పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.


logo