శనివారం 27 ఫిబ్రవరి 2021
National - Jan 22, 2021 , 16:10:03

అన్ని రైళ్లూ ప్రారంభ‌మ‌య్యేది ఆ నెల‌లోనే..!

అన్ని రైళ్లూ ప్రారంభ‌మ‌య్యేది ఆ నెల‌లోనే..!

న్యూఢిల్లీ:  రైళ్ల కోసం ఆతృత‌గా ఎదురుచూస్తున్న వాళ్ల‌కు ఇది బ్యాడ్ న్యూసే. ప్రస్తుతం కేవ‌లం ప్ర‌త్యేక రైళ్ల‌నే న‌డుపుతున్న ఇండియ‌న్ రైల్వేస్‌.. అన్ని రైళ్ల‌ను ప్రారంభించ‌డానికి మ‌రో రెండు నెల‌ల స‌మ‌య‌మైనా తీసుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. రైల్వేస్‌లోని ఓ సీనియ‌ర్ అధికారి దీనిపై స్పందిస్తూ.. మార్చి నెల‌ఖ‌రులోనే 100 శాతం రైళ్లు ప్రారంభం కావ‌చ్చ‌ని చెప్పారు. ప్ర‌స్తుతం రైల్వేస్ 65 శాతం ఎక్స్‌ప్రెస్ రైళ్ల‌ను మాత్ర‌మే న‌డుపుతోంది. అయితే ప్ర‌తి నెలా ఈ రైళ్ల సంఖ్య‌ను 100 నుంచి 200 వ‌ర‌కూ పెంచనున్న‌ట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇక వ‌చ్చే నెల‌లో ఢిల్లీ-ఎన్సీఆర్‌లో లోక్ రైళ్ల‌ను ప్రారంభించాల‌ని కూడా ఇండియ‌న్ రైల్వేస్ భావిస్తోంది. 

VIDEOS

logo