శనివారం 27 ఫిబ్రవరి 2021
National - Jan 24, 2021 , 22:40:35

100 మంది మెరిట్ విద్యార్థుల‌కు ప‌రేడ్ చాన్స్‌!

100 మంది మెరిట్ విద్యార్థుల‌కు ప‌రేడ్ చాన్స్‌!

న్యూఢిల్లీ: మ‌ంగ‌ళ‌వారం జ‌రిగే రిప‌బ్లిక్ డే వేడుక‌ల్లో స్కూళ్లు, కళాశాల‌ల నుంచి సుమారు 100 మంది మెరిట్ విద్యార్థులు పాల్గొనే అవ‌కాశం ఉంది. ఈ సంగ‌తి కేంద్ర వి్ద్యాశాఖ తెలిపింది. ప‌రేడ్ పూర్త‌యిన త‌ర్వాత స‌ద‌రు విద్యార్థులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ర‌మేశ్ పోఖ్రియాల్ నిశాంక్‌తో ఇష్ఠాగోష్టిగా స‌మావేశం అవుతారు. 2021 రిప‌బ్లిక్ డే ప‌రేడ్‌ను ప్ర‌ధాన‌మంత్రి బాక్స్ నుంచి 100 మంది మెరిట్ విద్యార్థులు వీక్షించేందుకు అవ‌కాశం క‌ల్పిస్తున్నందుకు సంతోషంగా ఉంద‌ని కేంద్ర విద్యాశాఖ ట్వీట్ చేసింది.

త‌ర్వాత విద్యాశాఖ మంత్రి డాక్ట‌ర్ ఆర్‌పీ నిశాంక్‌తో భేటీ అవుతార‌ని తెలిపింది. స్కూళ్ల నుంచి 50 మంది, ఉన్న‌త విద్యాసంస్థ‌ల నుంచి 50 మంది విద్యార్థుల‌ను ఎంపిక చేశారు. గ‌తేడాది సీబీఎస్ఈ స్కూళ్లు, కేంద్ర యూనివ‌ర్సిటీల నుంచి 105 మంది మెరిట్ విద్యార్థులు నేరుగా రిప‌బ్లిక్ డే ప‌రేడ్‌ను వీక్షించారు. 

క‌రోనా ఆంక్ష‌లు, మార్గ‌ద‌ర్శ‌కాలు అమ‌లులో ఉన్న నేప‌థ్యంలో సంద‌ర్శ‌కుల సంఖ్య‌ను 25 వేల మందికి త‌గ్గించిన‌ట్లు అధికారులు తెలిపారు. ఇక ఈ ఏడాది ముఖ్య అతిథి లేకుండానే రిప‌బ్లిక్ డే వేడుక‌లు జ‌రుగ‌నున్నాయి. మోటార్ బైక్‌ల‌పై స్టంట్లు ఈ ద‌ఫా సంద‌ర్శ‌కుల‌కు క‌నువిందు చేయ‌నున్నాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo