మధ్యప్రదేశ్‌లోకి 100 మంది మావోయిస్టుల చొరబాటు

బాలాఘాట్ : ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి దాదాపు 100 మంది మావోయిస్టులు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోకి చొరబడ్డారు. ఈ విషయాన్ని అక్కడి పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. తమ బేస్ క్యాంప్‌ను విస్తరించే క్రమంలో గడిచిన కొన్ని నెలలుగా ఈ చొరబాట్లు చోటుచేసుకున్నట్లు తెలిపారు. విశ్వసనీయ సమాచారంతో బాలాఘాట్, గిరిజన జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఆరు కంపెనీల పారామిలటరీ బలగాలను మోహరించినట్లు చెప్పారు. మావోయిస్టు గ్రూప్‌నకు చెందిన ఆరు దళాలు బాలాఘాట్, మాండ్ల జిల్లాల్లో కార్యకలాపాలను విస్తరిస్తున్నాయన్నారు. మాండ్లలో కతియా మోంచా దళం గతేడాదే వచ్చినట్లుగా తెలిపారు.
మాండ్ల-బాలాఘాట్ సుదీర్ఘ సరిహద్దును కలిగిఉన్నాయి. మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తం మిశ్రా గడిచిన నెలలో బాలాఘాట్ సందర్శన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. మావోయిస్టుల ఆచూకీకి ఆరు కంపెనీల పారామిలటరీ బలగాలను మోహరిస్తున్నట్లు తెలిపారు. బలాఘాట్లో నవంబర్, డిసెంబర్ 2020లో జరిగిన ఎన్కౌంటర్లో ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన ఇద్దరు మహిళా మావోయిస్టులు, మహారాష్ట్ర నుంచి వచ్చిన మరో మహిళా మావోయిస్టు హతమైనట్లు పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
- క్లినిక్ బయట ఫొటోలకు పోజులిచ్చిన కోహ్లి, అనుష్క
- మీర్జాపూర్ టీంకు నోటీసులు.. అమెజాన్ ప్రైమ్‌కు మరిన్ని కష్టాలు..!
- కోబ్రా ఫోర్స్‌లోకి మహిళల్ని తీసుకుంటున్నాం..
- శాండల్‌వుడ్ డ్రగ్ కేసు.. నటి రాగిణి ద్వివేదికి బెయిల్
- షార్ట్‌సర్య్కూట్‌తో యూరియా లారీ దగ్ధం
- రైల్వే కార్మికులతో స్నేహభావంగా మెలిగాం : మంత్రి కేటీఆర్
- పీపీఈ కిట్‌లో వచ్చి 13 కోట్ల బంగారం దోచుకెళ్లాడు
- కాబోయే సీఎం కేటీఆర్‌కు కంగ్రాట్స్ : డిప్యూటీ స్పీకర్ పద్మారావు
- హరిహరన్ మెడలోని డైమండ్ చైన్ మాయం..!
- చరిత్రలో ఈరోజు.. బ్రిటిష్ గవర్నర్‌పై బాంబు విసిరిన దేశభక్తుడతడు..