గురువారం 09 జూలై 2020
National - Jun 25, 2020 , 14:00:46

మంత్రులు, ఎమ్మెల్యేల కోసం.. కరోనా కేంద్రాలుగా డీలక్స్‌ గదులు

మంత్రులు, ఎమ్మెల్యేల కోసం.. కరోనా కేంద్రాలుగా డీలక్స్‌ గదులు

బెంగళూరు: కరోనా సోకిన సాధారణ ప్రజలకు దవాఖానలో బెడ్లు, కనీక సదుపాయాలు లభించక అవస్థలు పడుతున్నారు. మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు, వీఐపీలు, ప్రభుత్వ అధికారుల కోసం సకల ఏర్పాట్లు చేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం వివాదస్పదమైంది. బెంగళూరులో ఇటీవల పునరుద్ధరించిన కుమార కృప అతిథి గృహంలోని వంద డీలక్స్‌ గదులను కరోనా సోకిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వ ఉన్నతాధికారుల కోసం కేటాయిస్తున్నట్లు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వీవీఐపీ అతిథి గృహంలోని లగ్జరీ గదుల భర్తీ 33 శాతం మించకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. 

మరోవైపు ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఓ వైపు కరోనా సోకిన సాధారణ ప్రజలకు దవాఖానలో చోటు, వసతులు లేక అల్లాడుతుంటే మంత్రులు, ఎమ్మెల్యేలకు డీలక్స్‌ గదులను కరోనా కేంద్రాలుగా కేటాయించడాన్ని ప్రశ్నిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం తమ చర్యను సమర్దించుకున్నది. కరోనా సంక్షోభం నేపథ్యంలో అందుబాటులో ఉన్న అన్నింటిని వినియోగించుకుంటున్నట్లు పేర్కొంది. కర్ణాటకలో కరోనా కేసుల సంఖ్య పది వేలను దాటగా 164 మరణాలు నమోదయ్యాయి. logo