శుక్రవారం 30 అక్టోబర్ 2020
National - Sep 27, 2020 , 21:50:57

100శాతం ప‌రిశుభ్ర ఇంధ‌నాలు వాడాలి : కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ‌ప్ర‌ధాన్‌

  100శాతం ప‌రిశుభ్ర ఇంధ‌నాలు వాడాలి : కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ‌ప్ర‌ధాన్‌

ఢిల్లీ :ప్ర‌పంచ ప‌ర్యాట‌క దినోత్స‌వం సంద‌ర్బంగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ ఆదివారంపర్యాటక‌రంగం,గ్రామీణాభివృద్ధి అంశంపై జ‌రిగిన‌ వ‌ర్చువల్ స‌మావేశంలో ప‌ర్యాట‌క‌శాఖ మంత్రి ప్ర‌హ్లాద్‌సింగ్ ప‌టేల్ తో క‌లిసి ఆయ‌న‌  ప్ర‌సంగించారు. ప‌ర్యాట‌క మంత్రిత్వ‌శాఖ చేప‌ట్టిన కొత్త కార్య‌క్ర‌మం దేఖో అప్నాదేశ్ ను మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ ప్ర‌శంసించారు. ఇది స్థానిక సంస్కృతిని, ప‌ర్యాట‌క స్థ‌లాల‌ను ప్రోత్స‌హిస్తుంది. భార‌త దేశ సుసంప‌న్న సంస్కృతి, చ‌రిత్ర‌, ప్రాచీన అద్భుత నిర్మాణాలు,క‌ట్ట‌డాలు దేశంలో ప‌ర్యాట‌క రంగ అభివృద్ధికి అద్భుత అవ‌కాశాన్నిస్తాయ‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌పంచాన్ని అంత‌ర్జాతీయ గ్రామంగా మార్చ‌డంలో ఇంట‌ర్నెట్ పాత్ర గురించి ప్ర‌స్తావిస్తూ ప్ర‌ధాన్‌, ఇండియాన్ అంత‌ర్జాతీయ ప‌ర్యాట‌క ప్ర‌ముఖ ప్ర‌దేశంగా భార‌త‌దేశ స్థాయిని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని మ‌రింత‌గా వాడుకోవాల‌న్నారు.

ప‌ర్యాట‌క ప‌రిశ్ర‌మ ఉపాధి అవ‌కాశాల‌ను సృష్టించేందుకు, మ‌న యువ‌త‌కు, గ్రామీణ ప్రాంతాల‌లోని వారికిసైతం సాధికార‌త క‌ల్పించేందుకు,  అద్భుత శ‌క్తి క‌లిగి ఉన్న‌ద‌ని ఆయ‌న అన్నారు. మ‌న‌దేశంలోని ప్ర‌తి జిల్లాకు చెప్పుకునేందుకు ఒక చ‌రిత్ర ఉంద‌ని, లేదా ఒక మ‌హ‌నీయుడు ఆ ప్రాంతంతో ముడి ప‌డి ఉ న్నార‌ని, 2022 నాటికి భార‌త‌దేశం 75ఏండ్ల స్వాతంత్య్ర ఉత్స‌వాలు జ‌రుపుకోబోతున్న త‌రుణంలో మ‌నం మ‌న స్వాతంత్య్ర‌స‌మ‌ర‌యోధుల పోరాట‌స్ఫూర్తిని గుర్తుచేసుకుంటూ మ‌రిన్ని ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌ను తీర్చిదిద్దేందుకు కృషి చేయాల‌ని ఆయ‌న అన్నారు. ప‌ర్యాట‌కంతో సుస్థిరాభివృద్ధి సాధించేందుకు, అలాగే ప్ర‌ధాన ప‌ర్యాట‌క ప‌ట్ట‌ణాల‌లో నూరు శాతం ప‌రిశుభ్ర‌మైన ఇంధ‌నాన్ని వాడేందుకు కృషి చేయాల‌ని ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ పిలుపునిచ్చారు. ఇది ప‌రిశుభ్ర‌మైన ప‌ర్యావ‌ర‌ణానికి పాటుప‌డ‌డ‌మేకాక‌,ప‌ర్యాట‌కుల‌కు ప‌రిశుభ్ర‌మైన వాతావార‌ణాన్ని క‌ల్పిస్తుంద‌ని" ఆయన అన్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.