శనివారం 06 జూన్ 2020
National - May 22, 2020 , 18:48:34

పదేండ్ల క్రితం ఇదే రోజు భారత్‌లోనూ కూలిన విమానం

పదేండ్ల క్రితం ఇదే రోజు భారత్‌లోనూ కూలిన విమానం

హైదరాబాద్‌: సరిగ్గా పదేండ్ల క్రితం ఇదే రోజు (మే 22న) దుబాయ్‌ నుంచి వచ్చిన ఎయిర్‌ ఇండియా విమానం మంగళూరులో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 156 మంది మరణించారు. మృతులకు ఈ రోజు ఉదయం కర్ణాటకలోని న్యూమంగళూరులోని విమానాశ్రయంలో నివాళులు అర్పించారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే పాకిస్థాన్‌లోని కరాచీలో విమానం కూలిపోయి సుమారు 90 మంది మృతిచెందారు. 

పదేండ్ల క్రితం మే 22న దుబాయ్‌ నుంచి 166 మంది ప్రయాణికులతో మంగళూరుకు చేరుకున్న బోయింగ్‌ 737 విమానం ల్యాండింగ్‌ సమయంలో రన్‌వేను బలంగా ఢీకొట్టింది. దీంతో విమానం రెండు ముక్కలు అయ్యింది. అందులో ప్రయాణిస్తున్న 158 మంది మృతిచెందగా, మరో ఎనిమిది మంది అందులోనుంచి దూకి ప్రాణాలను కాపాడుకున్నారు. మరణించిన వారిలో ఎక్కువ మంది దుబాయ్‌కి వలస వెళ్లిన కార్మికులే ఉన్నారు. సరిగ్గా పదేండ్ల తర్వాత ఇదే రోజు అరేబియా సముద్రం ఒడ్డున ఉన్న మరో నగరమైన కరాచీలో విమానం కూలిపోయింది.  


logo