గురువారం 02 జూలై 2020
National - Apr 26, 2020 , 17:03:00

స్పైస్ జెట్ విమానంలో 10 ట‌న్నుల సామాగ్రి..వీడియో

స్పైస్ జెట్ విమానంలో 10 ట‌న్నుల సామాగ్రి..వీడియో

కోల్‌క‌తా: క‌రోనా పాజిటివ్ కేసులు దేశ‌వ్యాప్తంగా అంత‌కంతకూ పెరుగుతుండ‌టంతో కేంద్రం విదేశాల నుంచి అవ‌స‌ర‌మైన వైద్య సంబంధిత సామాగ్రిని తీసుకొస్తుంది. కోవిడ్‌-19 నిరోధానికి వినియోగించే సామాగ్రితోపాటు మాస్కుల త‌యారీ యంత్రాలు, ఇత‌ర యంత్ర సామాగ్రి స్పైస్ జెట్ ప్ర‌త్యేక విమానంలో భార‌త్ కు చేరుకుంది. శ‌నివారం రాత్రి షాంఘై నుంచి కోల్ క‌తా ఎయిర్ పోర్టు వైద్య ప‌రీక్ష‌లు స‌దుపాయాలకు అవ‌స‌ర‌మయ్యే 10 ట‌న్నుల బ‌రువున్న సామాగ్రి చేరుకుంది. 

క‌రోనా నుంచి కాపాడుకోవ‌డానికి అవ‌స‌ర‌మైన వైద్య సామాగ్రి పంపిణీ దేశవ్యాప్తంగా నిరంతరంగా జరుగుతోంది. దేశీయ ప్ర‌భుత్వ, ప్రైవేట్ ఎయిర్ లైన్ సంస్థ‌లు దేశ‌వ్యాప్తంగా ప‌లు ప్ర‌ధాన ప‌ట్ట‌ణాల‌కు ఇప్ప‌టికే వైద్య‌ప‌రిక‌రాలు స‌ర‌ఫ‌రా చేశాయి. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo