శంషాబాద్, జూన్ 23: కరోనా టీకా తీసుకున్నవారికి ఇండిగో విమానయాన సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. టీకా తీసుకున్నవాళ్లు తమ సంస్థకు చెందిన విమానాల్లో ప్రయాణిస్తే టికెట్ ధరపై 10 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఆఫర్ కోసం టీకా వేసుకున్నట్లు ధ్రువపత్రాన్ని చూపించాలి.