ఆదివారం 31 మే 2020
National - May 16, 2020 , 13:16:19

పశ్చిమబెంగాల్‌లో కొత్తగా 84 కరోనా కేసులు

పశ్చిమబెంగాల్‌లో కొత్తగా 84 కరోనా కేసులు

కోల్‌కతా: కరోనా వైరస్‌తో పశ్చిమబెంగాల్‌లో గత 24 గంటల్లో పది మంది మరణించగా, కొత్తగా 84 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,461కి చేరగా, ఈ వైరస్‌ వల్ల ఇప్పటివరకు మొత్తం 225 మంది బాధితులు మృతిచెందారు. మొత్తం నమోదైన కేసుల్లో 1407 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 829 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా 43 కోల్‌కతాకు సంబంధించినవే ఉన్నాయి.


logo