మంగళవారం 26 మే 2020
National - May 07, 2020 , 13:25:52

భారీ తాబేలు తీరానికొచ్చి..సముద్రంలోకి వెళ్లింది..వీడియో

భారీ తాబేలు తీరానికొచ్చి..సముద్రంలోకి వెళ్లింది..వీడియో

సముద్రంలో తిరిగి బోరు కొట్టిందో ఏమో భారీ లెద‌ర్ బ్యాక్ తాబేలు తీరానికి వ‌చ్చింది. సుమారు 10 అడుగులున్న ఈ తాబేలు కొద్ది సేపు తీరంలో సేద తీరింది. ఇక ఆ త‌ర్వాత మెల్ల‌మెల్ల‌గా త‌న ఆవాసమైన‌ సముద్రంలోకి వెళ్లిపోయింది.

తాబేలు స‌ముద్రంలోకి వెళ్తుండ‌గా అక్క‌డున్న ఓ వ్య‌క్తి వీడియో తీశాడు. ఈ వీడియో ను ఐఎఫ్ఎస్ అధికారి సుసంత నందా ట్విట్ట‌ర్ లో షేర్ చేశారు. భూమి మీదున్న అతిపెద్ద తాబేళ్ల‌లో లెద‌ర్ బ్యాక్ తాబేలు కూడా ఒక‌టి. దీన్ని ల్యూట్ అని కూడా పిలుస్తుంటారు.  

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo