మంగళవారం 14 జూలై 2020
National - Jun 28, 2020 , 10:40:51

స్కూల్ వాష్ రూమ్ లో చిరుత క‌ళేబ‌రం

స్కూల్ వాష్ రూమ్ లో చిరుత క‌ళేబ‌రం

ల‌క్నో : ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని ఓ గ్రామంలో చిరుత క‌ళేబ‌రం ల‌భ్య‌మైంది. నిర్మాణంలో ఉన్న పాఠ‌శాల భ‌వ‌నం బాత్రూమ్ లో ప‌ది రోజుల చిరుత చ‌నిపోయి ఉండ‌టాన్ని పిల్ల‌లు గుర్తించారు. పిల్ల‌లు, స్థానికులు క‌లిసి అట‌వీశాఖ అధికారుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థ‌లికి అట‌వీశాఖ అధికారులు చేరుకుని చిరుత క‌ళేబ‌రాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంత‌రం దాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప‌శువుల ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.  

అయితే చిరుత స్కూల్ బిల్డింగ్ భ‌వ‌నం పైనుంచి ప్ర‌మాద‌వ‌శాత్తు.. వాష్ రూంలో ప‌డిపోయిన‌ట్లు అధికారులు భావిస్తున్నారు. వాష్ రూం త‌లుపులు బ‌య‌ట‌నుంచి మూసి ఉండ‌టంతో ఊపిరాడ‌క మృతి చెందిన‌ట్లు నిర్ధారించారు. 


logo