గురువారం 02 జూలై 2020
National - Jun 16, 2020 , 10:09:14

24 గంటల్లో 10,667 కేసులు.. 380 మంది మృతి

24 గంటల్లో 10,667 కేసులు.. 380 మంది మృతి

న్యూఢిల్లీ : దేశ ప్రజలను కరోనా వైరస్‌ గజగజ వణికిస్తోంది. కరోనా ధాటికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,667 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 380 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 3,43,091 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 1,53,178 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 1,80,013 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు భారత్‌లో 9,900 మంది కరోనాతో చనిపోయారు.

మహారాష్ట్రలో అత్యధికంగా 1,10,744 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 4,128 మంది చనిపోయారు. తమిళనాడులో 46,504(మృతులు 479), ఢిల్లీలో 42,829(మృతులు 1,400), గుజరాత్‌లో 24,104(మృతులు 1,506), యూపీలో 14,091(మృతులు 417) కేసులు నమోదు అయ్యాయి. 


logo