శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
National - Feb 23, 2021 , 10:36:52

దేశంలో తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..?

దేశంలో తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..?

న్యూఢిల్లీ : దేశంలో గత కొద్ది రోజులుగా పెరుగుతూ వచ్చిన కరోనా పాజిటివ్‌ కేసులు మంగళవారం కాస్త తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 10,584 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. మరో 13,255 మంది కొత్తగా డిశ్చార్జి అవగా.. 78 మంది మరణించారని చెప్పింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,10,16,434కు చేరింది. 1,07,12,665 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా మహమ్మారికి 1,56,463 మంది బలయ్యారు. ప్రస్తుతం దేశంలో 1,47,306 యాక్టివ్‌ కేసులున్నాయని కేంద్రం తెలిపింది. టీకాడ్రైవ్‌లో భాగంగా 1,17,45,55 మందికి వ్యాక్సిన్లు వేసినట్లు వివరించింది. ఇదిలా ఉండగా.. నిన్న ఒకే రోజు 6,78,685 కొవిడ్‌ శాంపిల్స్‌ పరిశీలించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ తెలిపింది. ఇప్పటి వరకు 21,22,30,431 శాంపిల్స్‌ పరీక్షించినట్లు వివరించింది.

VIDEOS

logo