మంగళవారం 07 జూలై 2020
National - Jun 16, 2020 , 16:08:24

10,215 మందికి క‌రోనా నుంచి విముక్తి

 10,215 మందికి క‌రోనా నుంచి విముక్తి

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగ‌డంతోపాటే ఆ మ‌హ‌మ్మారి బారి నుంచి కోలుకుంటున్న క‌రోనా బాధితుల‌ సంఖ్య కూడా పెరుగుతున్న‌ది. దీంతో రిక‌వ‌రీ రేటు రోజురోజుకు పెరుగుతూ వ‌స్తున్న‌ది. దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళ‌న‌క‌ర స్థాయిలో ఉన్న‌ప్ప‌టికీ... రిక‌వ‌రీ రేటు కూడా పెరుగుతుండ‌టం కొంత‌మేరకు ఊర‌ట‌నిస్తున్న‌ది. దేశంలో క‌రోనా రిక‌వ‌రీ రేటుకు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ఒక ప్ర‌క‌ట‌న చేసింది. 

సోమ‌వారం మ‌ధ్యాహ్నం నుంచి మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కు గడిచిన 24 గంటల్లో 10,215 మంది కరోనా బాధితులు ఆ మ‌హ‌మ్మారి బారి నుంచి కోలుకున్నార‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడి కోలుకున్న బాధితుల సంఖ్య 1,80,012కు చేరింది. క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యేవారి సంఖ్య పెరుగుతున్నా కొద్ది దేశంలో రిక‌వ‌రీ రేటు కూడా మెరుగుప‌డుతూ వ‌స్తున్న‌ది. ప్ర‌స్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 52.47 శాతంగా ఉంది. మ‌రో 1,53,178 మంది కరోనా బాధితులు వివిధ‌  ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 


logo