శనివారం 04 జూలై 2020
National - Jun 21, 2020 , 12:00:16

జమ్ములో ఎన్‌కౌంటర్‌.. శ్రీనగర్‌లో ఇంటర్నెట్‌ బంద్‌

జమ్ములో ఎన్‌కౌంటర్‌.. శ్రీనగర్‌లో ఇంటర్నెట్‌ బంద్‌

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లో జాదిబాల్‌ ప్రాంతంలో భద్రతా బలగాల కాల్పుల్లో ఉగ్రహది హతమయ్యాడు. నగరంలోని జాదిబాల్‌, జూనిమార్‌ పొజ్వాలపొరా ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు, కశ్మీర్‌ పోలీసులు ఆదివారం ఉదయం సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. ముగ్గురు ఉగ్రవాదులు ఓ భవనంలో దాక్కోవడంతో దాన్ని చుట్టుముట్టాయి. దీంతో వారు భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. ప్రతిగా భద్రతా బలగాలు ఎదురు కాల్పులు ప్రారంభించడంతో ఒక ఉగ్రవాది చనిపోయాడని కశ్మీర్‌ ఐజీ విజయ్‌ కుమార్‌ వెల్లడించారు. ఎన్‌కౌంటర్‌ ఇంకా కొనసాగుతున్నదని చెప్పారు. ఈ నేపథ్యంలో శ్రీనగర్‌లో ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేశామని తెలిపారు.   

ముగ్గురు ఉద్రవాదుల్లో ఇద్దరు 2019 నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్నారని, రెండు నెలల క్రితం ఇద్దరు బీఎస్‌ఎఫ్‌ జవాన్లపై జరిగిన దాడిలో వారి ప్రమేయం ఉన్నదని చెప్పారు. ఉగ్రవాదులను లొంగిపోవాలని కోరినప్పటికీ వారు అంగీకరించలేదని తెలిపారు. నెల రోజుల వ్యవధిలో శ్రీనగర్‌లో ఇది రెండో ఎన్‌కౌంటర్‌. మే నెలలో ఇద్దరు హిజ్‌బుల్‌ ముజాహిద్దిన్‌ ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుపెట్టాయి.


logo