గురువారం 28 మే 2020
National - May 14, 2020 , 11:21:52

రోహిణి జైల్లో కరోనా కలవరం.. ఖైదీకి పాజిటివ్‌

రోహిణి జైల్లో కరోనా కలవరం.. ఖైదీకి పాజిటివ్‌

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని కరోనా వైరస్‌ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రోహిణి జైలును కరోనా తాకింది. ఆ జైల్లోకి ఓ ఖైదీకి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో మరో 20 మంది ఖైదీలను, ఐదుగురు సిబ్బందిని అధికారులు క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించారు. అయితే కరోనా సోకిన ఖైదీ.. పేగు సమస్యతో బాధపడుతూ ఇటీవలే ఢిల్లీలోని డీడీయూ ఆస్పత్రిలో చేరారు. మే 10వ తేదీన అతనికి శస్త్రచికిత్స పూర్తయింది. శస్త్రచికిత్స అనంతరం ముందు జాగ్రత్తగా ఖైదీకి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 

ఢిల్లీ వ్యాప్తంగా 7,998 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు కరోనాతో 106 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో 975 మంది, గుజరాత్‌లో 566, రాజస్థాన్‌లో 122, మధ్యప్రదేశ్‌లో 232, వెస్ట్‌ బెంగాల్‌లో 207 మంది మృతి చెందారు.


logo