శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 19, 2020 , 12:19:25

ఢిల్లీలో భారీ వర్షం.. ఒకరి మృతి

ఢిల్లీలో భారీ వర్షం.. ఒకరి మృతి

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున భారీ వాన కురిసింది. దీంతో నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొన్ని ప్రధాన రోడ్లపై భారీఎత్తున నీరు నిలిచిపోయింది. దీంతో నీటిలో మునిగిపోయి ఓ ఆటో డ్రైవర్‌ మరణించాడు. ఐకానిక్‌ మింటో బ్రిడ్జ్ వద్ద నీటిలో కొట్టుకుపోత్తున్న మృతదేహాన్ని ఓ డ్రైవర్‌ గుర్తించి, దాన్ని ఒడ్డుకు చేర్చాడు. మరణించిన వ్యక్తిని చండీగఢ్‌కు చెందిన కుందన్‌ (56)గా గుర్తించారు. అదేవిధంగా మింటో బ్రిడ్జ్‌ వద్ద భారీగా నీరు చేరడంతో ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌కార్పొరేషన్‌కు చెందిన ఓ బస్సు మునిగిపోయింది. దీంతో అందులో ఉన్న ప్రయాణికులను అగ్నిమాక శాఖ సిబ్బంది రక్షించారు. 

ఢిల్లీతోపాటు పరిసర ప్రాంతాల్లో భారీ వానలు కురిసినట్లు వాతావరణ విభాగం వెల్లడించింది. ఉదయం 8.30 గంటల వరకు 74.8 మి.మీ. వర్షపాతం నమోదయ్యిందని సఫ్దర్‌గంజ్‌ అబ్జర్వేటరీ ప్రకటించింది. ఢిల్లీతోపాటు అదంపూర్‌, హిస్సార్‌, హన్సీ, జింద్‌, గోహానా, గన్నౌర్‌, బారుట్‌, రోహ్‌తక్‌, సోనిపట్‌, బాగ్‌పాట్‌, గుర్‌గావ్‌, నోయిడా, ఘజియాబాద్‌, ఫరీదాబాద్‌లో భారీ వర్షం కురిసింది.logo