బుధవారం 03 జూన్ 2020
National - May 21, 2020 , 16:17:29

కశ్మీర్‌లో కాల్పులు.. ఓ పోలీసు మృతి

కశ్మీర్‌లో కాల్పులు.. ఓ పోలీసు మృతి

జమ్ముకశ్మీర్‌: కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రజలంతా ఇండ్లకు పరిమితమైన వేళలో.. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మాత్రం భద్రతా బలగాలపై వరుసగా కాల్పులు తెగబడుతున్నారు. బుధవారం గందర్‌బాల్‌ జిల్లాలో ఒక్కసారిగా విరుచుకుపడి కాల్పులు జరిపిన ఘటనలో ఇద్దరు బీఎస్‌ఎఫ్‌ జవాన్లు కన్నుమూయగా.. గురువారం పుల్వామా ప్రాంతంలో జరిపిన కాల్పుల్లో ఒక పోలీసు మృతిచెందాడు. మరో సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ తీవ్రంగా గాయపడ్డాడు. వీరి నుంచి ఆయుధాలను ఉగ్రవాదులు లాక్కెళ్లిపోయారు. బైకులపై వచ్చిన ఉగ్రవాదులు పోలీసులే లక్ష్యంగా కాల్పులు జరిపి పారిపోయారని సీనియర్‌ పోలీస్‌ అధికారి ఒకరు చెప్పారు. రెండు రోజుల్లో వరుసగా ఉగ్రవాదుల కాల్పులు జరుపడంతో భద్రతా దళాలు అలర్ట్‌ అయ్యాయి. పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఇలాఉండగా, కుప్వారా జిల్లాలోని సోగమ్‌ ప్రాంతంలో ఇటీవలనే ఉగ్రవాదులతో చేరిన ముగ్గురు వ్యక్తులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాయి.


logo