మంగళవారం 14 జూలై 2020
National - Jun 14, 2020 , 18:40:27

చెన్నైలో ఒక్కరోజే 1,415 కరోనా కేసులు

చెన్నైలో ఒక్కరోజే 1,415 కరోనా కేసులు

చెన్నై: తమిళనాడులో రోజురోజుకూ కరోనా  పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 1,974 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఒక్క చెన్నై నగరంలోనే 1,415 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  గడచిన 24 గంటల్లో మరో 38 మంది కరోనా వల్ల చనిపోయారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 44,661కు చేరింది.

ప్రస్తుతం 19,676 మంది బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం సాయంత్రం వరకు 24,547 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా బారినపడి ఇప్పటి వరకూ 435 మంది మృతిచెందారు. 


logo