శనివారం 05 డిసెంబర్ 2020
National - Aug 25, 2020 , 22:55:00

అసోంలో కొత్తగా 1,973 కరోనా కేసులు

అసోంలో కొత్తగా 1,973 కరోనా కేసులు

డిస్పూర్: ఈశాన్య రాష్ట్రం అసోంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,973 కొత్త కొవిడ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. ఈ 24 గంటల్లో 34,307 టెస్టులు నిర్వహించినట్లు తెలిపింది. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 94,592కు పెరిగిందని వివరించింది. ఇందులో 21,239 క్రియాశీల కేసులున్నట్లు తెలిపింది. కాగా, కొవిడ్‌తో కోలుకుని 73,090 మంది డిశ్చార్జ్‌ అయినట్లు పేర్కొంది. 260 మంది మరణించినట్లు వివరించింది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.