చాక్లెట్లు, క్యాండీలు, కూల్‌డ్రింక్‌లలో చక్కెర పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విషయం తెలిసి కొందరు, తెలియక చాలామంది తాము తినడమేకాక పిల్లలకూ వాటిని తినిపిస్తున్నారు. ఇవి కౌమారం, యుక్తవయసు వారిలో జ్ఞాపక శక్తిపైనా, నేర్చుకునే తత్వంపైనా దుష్ప్రభావం చూపిస్తాయని తాజా అధ్యయనం పేర్కొంది. హై షుగర్ స్నాక్స్ వల్ల ఒబెసిటీ, గుండె జబ్బులు, జ్ఞాపకశక్తి లోపాలు తప్పవని స్పష్టమైంది. అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ జార్జియా, యూనివర్సిటీ ఆఫ్ సదరన్ క్యాలిఫోర్నియా శాస్త్రవేత్తలు ఈ పరిశోధన జరిపారు. ఇందులో భాగంగా, చక్కెర పదార్థాలను ఎక్కువగా తీసుకునే కౌమారంలోని పిల్లల హెల్త్ రిపోర్ట్‌లను పరిశీలించారు. జ్ఞాపకశక్తి, నేర్చుకునే తత్వం తక్కువగా కనిపించినట్లు వారు తెలిపారు.