శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 14:44:29

ఒడిశాలో కొత్తగా 1,376 కరోనా కేసులు

ఒడిశాలో కొత్తగా 1,376 కరోనా కేసులు

భుబనేశ్వర్‌ : ఒడిశాలో గడిచిన 24 గంటల్లో 1,376 కరోనా కేసులు నమోదు కాగా వ్యాధి బారిన పడి 10 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 25,389కు చేరింది. ఇందులో 9,287 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. 15,928మంది కరోనా నుంచి కోలుకోగా 140 మంది ఇప్పటివరకు మృతి చెందారు. 

ఇదిలా ఉండగా దేశంలో గడిచిన 24 గంటల్లో 48,661 కరోనా కేసులు నమోదు కాగా 705 మంది మృతి చెందినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ ఆదివారం తెలియజేసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 13,85,522కు చేరింది. ఇందులో 4,67,882 యాక్టీవ్‌ కేసులుండగా 8,85,577 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 32,063మంది ఇప్పటివరకు మృతి చెందారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo