మంగళవారం 07 జూలై 2020
National - Apr 18, 2020 , 13:40:22

మధ్యప్రదేశ్‌లో 1355 కరోనా కేసులు

మధ్యప్రదేశ్‌లో 1355 కరోనా కేసులు

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో కొత్తగా 1355 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఇండోర్‌ జిల్లాకు చెందినవి 881 కేసులు కాగా, 208 భోపాల్‌లో నమోదనవే ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 25 జిల్లాలు కరోనా వైరస్‌తో ప్రభావితమయ్యాయి. కరోనా పరీక్షల కోసం  మొత్తం 23,070 నమూనాలను సేకరించగా, ఇంకా 2,708 నమూనాలకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉందని మధ్యప్రదేశ్‌ ఆరోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 69 మంది మరణించగా, అందులో ఇండోర్‌కు చెందిన 47 మంది ఉన్నారు.


logo