శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 22:45:47

ఢిల్లీలో కొత్తగా 1,349 కరోనా కేసులు

ఢిల్లీలో కొత్తగా 1,349 కరోనా కేసులు

న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజురోజుకూ పాటిజివ్‌ సంఖ్య పెరుగుతుండగా మరణాలు అదేస్థాయిలో సంభవిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 1,349 కేసులు నమోదు కాగా 1,200 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 1,25,096 కేసులు నమోదయ్యాయి. 1,06,118 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి కాగా 15,288 మంది చికిత్స పొందుతున్నారని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ బులిటిన్లో పేర్కొంది. మహమ్మారి బారినపడి గడిచిన 24 గంటల్లో 27 మంది మృతి చెందగా.. ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 3,690కి చేరింది. ఢిల్లీలో కరోనా రికవరీ శాతం 84.83గాఉండగా మరణాల శాతం 2.95గా ఉంది. మంగళవారం 5,651 మందికి ఆర్-టీపీసీఆర్, 15,201 మందికి ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహించగా ఇప్పటివరకు 8,51,311 పరీక్షలు నిర్వహించినట్లు బులెటిన్లో పేర్కొంది.


logo